చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి.. బస్సు ఆపి పలకరించిన కేసీఆర్

  • జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్
  • తిరిగి వెళుతుండగా కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి
  • బస్సును ఆపమని సంజ్ఞ చేసి, చిన్నారిని పలకరించిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఓ చిన్నారి ప్రేమను చాటుకుంది. జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ అనంతరం ఆయన తన బస్సులో వెనుదిరిగారు. భారీ కాన్వాయ్‌తో వెళుతుండగా, పట్టణంలోని ఒక క్రాస్ రోడ్డు వద్ద ఓ చిన్నారి కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని ఆయనను చూసేందుకు నిలబడింది. చిన్నారి తన కోసం వేచి చూస్తుండటాన్ని గమనించిన కేసీఆర్, బస్సు ఆపి ఆమెను ఆప్యాయంగా పలకరించారు.

చిన్నారిని చూసిన కేసీఆర్, డ్రైవర్‌తో బస్సు ఆపమంటూ చేయితో సంజ్ఞ చేశారు. ఆమె చేతిలోని చిత్రపటాన్ని తీసుకురావాలని తన వద్ద ఉన్నవారిని పురమాయించారు. తన ఫొటోను చూసి ముచ్చటపడిన కేసీఆర్, బస్సు వెలుపల అద్దంలో నుంచి చూస్తున్న పాపను ఆప్యాయంగా పలకరించారు.

KCR in Jagityal Meeting
KCR jagityal Meeting
BRS joining
Jeevan Reddy joins BRS

More Telugu News